Miss Shetty Mr Polishetty Review: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ ట్విట్టర్ రివ్యూ

Byline :  Bharath
Update: 2023-09-07 03:33 GMT

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. గురువారం (సెప్టెంబర్ 7) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, గ్లింప్స్ తో అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిన్నటి నుంచే యూఎస్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ఉందని యూఎస్ ప్రీమియర్స్ చూసినవాళ్లు తెలిపారు. అదే హైప్ తో మన దగ్గర ప్రీమియర్ షోలు వేశారు. దాంతో సినిమా చూసినవాళ్లంతా ట్విట్టర్ వేదికగా తమ రివ్యూను పంచుకుంటున్నారు.




 


అనుష్క సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆమె సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న సినిమా ఇది. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ఉందని ట్విట్టర్ రివ్యూవర్స్ తెలిపారు. ఫుల్ ఫన్, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్గా ఉందని, నేటి యూత్కి కనెక్ట్ అయ్యేలా ఫన్నీగా సాగుతూ అందరినీ మెప్పిస్తుంది అని చెప్తున్నారు. నవీన్ పోలిశెట్టి మార్క్ డైలాగ్ డెలివరీతో హిలేరియస్‌గా నవ్వించాడని.. ఇది సాధారణ లవ్ స్టోరీ కాదని, అంతకు మించి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

‘స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్, చెఫ్ పాత్రలో అనుష్క.. ఇద్దరూ అదరగొట్టేశారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. వైవిధ్యమైన ప్రేమతో తన అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. అనుష్క ఇన్నాళ్ల వెయిటింగ్‌కు ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయి.. స్టాండప్ కమెడియన్ను ఇష్టపడటం.. అయితే పెళ్లి చేసుకోవడానికి కాకుండా.. గర్భం దాల్చడానికి హెల్ప్ అడగడం వంటి సీన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా నవీన్ తికమక పడుతూ చేసే నటన తప్పకుండ మెప్పిస్తుంది. ఇందులో డైలాగులు చాలా బాగున్నాయి. ఒక సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా చూపెట్టాడు డైరెక్టర్ మహేష్ బాబు. అదే అభిమానుల్ని ఆకట్టుకుంటుంది’ అని అభిమానులు చెప్తున్నారు.

 

Tags:    

Similar News