అతిపెద్ద శుభవార్త.. 26,146 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త తెలిపింది. కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 31వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫీజును 2024 జనవరి 1 రాత్రి 11గంటల వరకు చెల్లించే అవకాశం ఉంది.
అర్హతలు, ఫీజు...
అభ్యర్థుల వయసు జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వుడు కేటరిగీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. మిగతా వారికి మినహాయింపు.
పరీక్ష
కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ ద్వారా, పీఈటీ, పీఎస్‌టీ మెడికల్ టెస్టులు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 160 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. గంటలో పూర్తి చేయాలి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎలిమెంటరీ మేథమెటిక్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో నెగిటివ్ జవాబుకు పావు మార్కును కత్తిరిస్తారు. ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో.. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు సహా 13 ప్రాంతీయ భాషాల్లో, హిందీ, ఇంగ్లిష్‌లలో పరీక్ష ఉటుంది. ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -3 కింద నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 జీతం చెల్లిస్తారు.
ఖాళీలు
బీఎస్ఎఫ్, సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ తదితర విభాగాల్లో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 23,347 పోస్టుల్లో పురుషులను 2,799 మహిళలు తీసుకుంటారు. సీఆర్‌పీఎఫ్‌లో 3337, బీఎస్‌ఎఫ్‌లో 6,174, సీఐఎస్‌ఎఫ్‌లో 11,025, ఎస్‌ఎస్‌బీలో 635, ఐటీబీపీలో 3189, ఏఆర్‌లో 1490 ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 296 ఖాళీలు ఉన్నాయి.