ఒవైసీల వల్ల హైదరాబాద్‌కు రాలేని పరిస్థితి.. ప్రొఫెసర్ రియాజ్..
By : Mic Tv Desk
Update: 2023-08-12 13:54 GMT
ముస్లింలందరూ ఎంఐఎం పార్టీ వెంట లేరని, ఆ పార్టీది అప్రజాస్వామిక ధోరణి అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ రియాజ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంఐసీ పాత్ర లేదని, అది ముస్లింల పేరు చెప్పుకుని బతికే పార్టీ అని విమర్శించారు. పాతబస్తీ ఒవైసీలకు అడ్డాగా మారిందని, వారి కారణంగా హైదరాబాద్‌కు రావాలంటే భయపడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంఐఎం పాల్గొనలేదని వివరించారు. ఇటీవల కన్నుమూసిన ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అసలైన ప్రజాస్వామికవాది అని, ఆయన ఒవైసీలను వ్యతిరేకించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, మతసామరస్యం తదితర అంశాలపై ఆయన మైక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు..
వీడియో లింక్..