Home > ఆంధ్రప్రదేశ్ > ఆశా వర్కర్ ఉద్యోగాలంటూ భారీ మోసం.. రూ. 1.6 కోట్ల దోపిడి

ఆశా వర్కర్ ఉద్యోగాలంటూ భారీ మోసం.. రూ. 1.6 కోట్ల దోపిడి

ఆశా వర్కర్ ఉద్యోగాలంటూ భారీ మోసం.. రూ. 1.6 కోట్ల దోపిడి
X

ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్లు.. అమాయకులనే లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా.. ఓ కేటుగాడు ఉద్యోగాల పేరిట దేశవ్యాప్తంగా 1300 మందిని మోసం చేశాడు. వారి నుంచి రూ. 1.6 కోట్లు కొల్లగొట్టాడు. రాజన్న సిరిసిల్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరిట నకిలీ ప్రకటనలు ఇస్తున్నాడు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా వర్కర్ ఉద్యోగాలంటూ పేపర్‌లో ప్రకటన ఇచ్చాడు.

అది నమ్మిన రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళ అతడిని కాంటాక్ట్ అయింది. ఉద్యోగం రావాలంటే కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని నమ్మించాడు. అది నమ్మిన బాధితురాలు అతడికి రూ. 3 లక్షలు అకౌంట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత నిందితుడు పంపిన లింక్‌లో రెజ్యూమ్‌ను షేర్ చేయమని అడిగాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఫేక్ ఐడీలతో ఆమెకు ఈ మెయిల్స్ పంపాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు రామ్‌ప్రసాద్‌ను అరెస్టు చేశారు.

అతడికి సిమ్ కార్డులు అందించిన మరో నిందితుడు రామ్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసి రామ్ ప్రసాద్ ఇప్పటి వరకు 1.6 కోట్లు దోచుకున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు. అతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 65 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహాజన్ సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు.

Updated : 21 Aug 2023 2:00 PM IST
Tags:    
Next Story
Share it
Top