Home > ఆంధ్రప్రదేశ్ > తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణంలో అపశృతి ...

తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణంలో అపశృతి ...

తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణంలో అపశృతి

తిరుపతి శ్రీనివాస సేతు నిర్మాణంలో అపశృతి ...
X



తిరుపతిలో జరుగుతున్న శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రిలయన్స్‌ మార్టు సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద బుధవారం అర్ధరాత్రి 11.45 గంటలకు క్రేన్‌తో గడ్డర్‌ సెగ్మెంట్‌ను తరలిస్తున్నారు. ఈ క్రమంలో సెగ్మెంట్‌కు కింద కార్మికులు బోల్టులు బిగిస్తుండగా పైనున్న క్రేన్ వైర్లు తెగాయి. సెగ్మెంట్ వెంటనే జారి కిందపడడంతో కింద బోల్టులు బిగిస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. క్రేన్ల ద్వారా కాంక్రీట్ సెగ్మెంట్‌‌ను తరలించి వాటిని గడ్డర్లపై అమర్చే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన చెందిన అభిజిత్‌ఘోష్‌(20), బిహార్‌కు చెందిన బుద్ధా మందల్‌(44)గా గుర్తించారు. తిరుపతి ఈస్ట్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో నేరుగా తిరుమలవెళ్లేందుకు వీలుగా శ్రీనివాస సేతు పేరుతో ఫ్లైఓవర్ నిర్మాణాన్నిప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. తరచూ సమీక్షలు నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టు సంస్థపై ఒత్తిడి చేస్తున్నారు. రికార్డు సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన సమీక్షల్లో శ్రీనివాస సేతు నిర్మాణం దాదాపు 90శాతానికి పైగా పూర్తి కావడంతో మిగిలిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది జూన్ నాటికి శ్రీనివాస సేతును ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. గత ఫిబ్రవరిలో ఈ డెడ్‌లైన్‌ ప్రకటించిన ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేకపోయారు. సాంకేతిక సమస్యలతో పాటు పగటిపూట వేగంగా పనులు పూర్తి చేయడంలో అవరోధాలు ఎదురవడంతో జాప్యం జరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో విషాదం నెలకొంది.

శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదంపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణార్‌ రెడ్డి స్పందించారు.ఫ్లైఓవర్‌ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటించారు.


Updated : 27 July 2023 4:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top