CM JAGAN : వారికి కీలక బాధ్యతలు.. వైసీపీ 8వ జాబితా విడుదల
X
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఏడు జాబితాలలో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 60 మందికిపైగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పేర్లను వైసీపీ వెల్లడించింది. తాజాగా మరో 3 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను ప్రకటిస్తూ 8వ జాబితాను విడుదల చేసింది.
గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోశయ్యను, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నుంచి ఎమ్మెల్యే సీటును కల్పించింది. అలాగే గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమ్మారెడ్డి వెంకట రమణ స్థానంలో కిలారి రోశయ్యను నిలబెట్టింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్‌ను, జి.డి.నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్ కృపాలక్ష్మికి అవకాశాన్ని కల్పించింది.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు అభ్యర్థుల పేర్లను మారుస్తూ వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. జీడి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తను కూడా మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా చర్చ నెలకొంది. మార్పుల వల్ల కొందరిలో అసంతృప్తి మొదలైందని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇకపోతే వైసీపీని ఈ ఎన్నికల్లో ఢీకొట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమవుతున్నాయి.