Chandrababu Naidu : చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదు
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ రావడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో.. చంద్రబాబు బెయిల్ పై వచ్చారని ర్యాలీ నిర్వహించారు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు. దీనిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం నిబంధనలను అతిక్రమించడమేనని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్‌లో ఉండి ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన కేసుల్లో కొన్నింటిలో బెయిల్ రాగా మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను చంద్రబాబు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.