Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదు

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదు

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కేసు నమోదు
X

తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై తిరుమల వన్ టౌన్ పోలీస్ట్ స్టేషన్ లో టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ప్రస్తుతం రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమల దేవస్థానంతో పాటు ఈవో ధర్మారెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేసినట్లు ఈ వీడియోలో ఉంది. కాగా సోషల్ మీడిలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోపై రమణ దీక్షితులు స్పందించారు. ఈ మేరకు ఆయన టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను బీసీయూ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కలవలేదని చెప్పారు. అంతేగాక టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా..ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. తిరుమల, తిరుపతి దేవస్థానంతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆ వీడియో ఉందని తెలిపారు. కాగా ఈ విషయంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు అన్నారు.

వీడియోలో...

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం వ్యాప్తి చెందిదని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణ దీక్షితులు చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీటీడీ, ఈవో ధర్మారెడ్డి పై ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

Updated : 24 Feb 2024 6:52 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top