Home > ఆంధ్రప్రదేశ్ > YS Viveka Daughter Sunitha : వివేకా కేసులో ట్విస్ట్.. ఆయన కూతురిపై కేసు నమోదు..
YS Viveka Daughter Sunitha : వివేకా కేసులో ట్విస్ట్.. ఆయన కూతురిపై కేసు నమోదు..
Mic Tv Desk | 18 Dec 2023 11:15 AM IST
X
X
వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సమయంలో ఎస్పీ రామ్ సింగ్ వేధించారని, సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సీబీఐ చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఆ పిటిషన్లో వివరించారు.
ఈ క్రమంలో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా.. ఫలితం లేదని కృష్ణారెడ్డి ఆరోపించారు. అ పిటిషన్పై విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ముగ్గురిపై సెక్షన్ 156 (3) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated : 18 Dec 2023 11:15 AM IST
Tags: ys viveka viveka case ys sunitha viveka daughter Pulivendula cm ys jagan pulivendula court pulivendula police ys avinash reddy kadapa mp andhra pradesh ycp tdp telugu news telugu updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire