వైసీపీకి ఘోర ఓటమి తప్పదు.. ప్రశాంత్ కిశోర్ షాకింగ్ కామెంట్స్
X
ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఈసారి వైసీపీ గెలవడం సాధ్యం కాదని పలువురు చర్చించుకుంటే వైసీపీ మాత్రం గెలవడం మాత్రం పక్కా అని చెబుతోంది. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్‌కు భారీ ఓటమి ఖాయమని తెగేసి చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు.
ప్రజల బాగోగులు చూస్తామని చెబుతూనే వారి సొమ్మునే ఖర్చు చేయడం తప్పని అన్నారు. ఆ విధంగా చేయడం వల్ల సీఎం జగన్ రాజకీయంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా అదే జరిగిందన్నారు. ప్యాలెస్‌లో కూర్చుని బటన్ నొక్కితే ఎన్నికల్లో ఓట్లు పడవని అన్నారు. ఏపీలో చదువుకున్నవారు ఉద్యోగాలు కోరుకుంటున్నారని, ఉచితాలు వారికి అవసరం లేదన్నారు.
ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. అనేక సర్వేలు ఈసారి వైసీపీయే గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..ఓ మాయల పకీర్ అన్నారు. బీహార్‌లో చెల్లని రూపాయే ప్రశాంత్ కిశోర్ అని ఎద్దేవా చేశారు. ఏపీలో చెల్లని రూపాయి బాబుతో కలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. బాబు స్క్రిప్ట్‌ను చదివి వినిపిస్తున్నాడని, ఎవరెన్ని చెప్పినా ఈసారి వైసీపీ గెలవడం ఖాయమని అన్నారు.