ఏలూరులో కిడ్నాప్ కలకలం..వీడియో వైరల్
Mic Tv Desk | 16 Jun 2023 7:29 PM IST
X
X
ఏపీలో మరో కిడ్నాప్ కలకం రేగింది. ఏలూరులో ఓ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ఆ యువకుడిని బలవంతంగా లాక్కెళ్లి..కొడుతూ కారులో ఎక్కించారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఎదుట ఉన్న సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.
మొత్తం ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి యువకుడిని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే ఈ కిడ్నాప్ జరిగింది. ఆ సమయంలో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్‌కు వాడిన కారు అధికార పార్టీ నేత, మాజీ మంత్రికి సన్నిహితంగా ఉండే నాయకుడిదిగా సమాచారం.
Updated : 16 Jun 2023 7:33 PM IST
Tags: eleuru A young man kidnap ideo viral
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire