స్నేహం కోసం ప్రాణం ఇస్తా అని.. కట్ చేసుకున్నాడు...
X
స్నేహం కోసం ప్రాణమిస్తానని మద్యం మత్తులో ఆవేశానికి లోనైన యువకుడు..తనకు తాను గాయపర్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఇబ్రహీం అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాట మాట పెరిగి ఫ్రెండ్షిప్ కోసం వాదన జరిగింది.
దీంతో కోపానికి గురైన ఇబ్రహీం స్నేహానికి తాను ఎంతో విలువ ఇస్తానని, స్నేహితుల కోసం ప్రాణాలు ఇచ్చేస్తానంటూ తొడ భాగంలో కత్తితో కోసుకున్నాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇబ్రహీం మరణించాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది.
అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది తననంతట తాను కోసుకున్నాడా లేక స్నేహితులు దాడి చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి మిత్రులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కడప నగరంలోని నకష్‌కు చెందిన ఇబ్రహీంపై పలు కేసులు నమోదైయ్యాయని పోలీసులు గుర్తించారు. ఏదేమైనా స్నేహం కోసం ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.