Chandrababu Petition: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ వాయిదా
X
ఏపీ డెవలప్ మెంట్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న "చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది". ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. రెగ్యూలర్ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో .. నేడు విచారణ చేపట్టడం సాధ్యం కాదని ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇవాళే వాదనలు వినాలని చంద్రబాబు తరుపు లాయర్లు ప్రమోద్ కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఈ రోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి స్పష్టం చేశారు. రేపు సీఐడీ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు.
ఇక ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) కూడా.. రేపే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి తెలుస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.