Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: ‘అంతా ఓపెన్గానే జరిగింది’.. కోర్టు ఏం చెప్పిందంటే?

Chandrababu: ‘అంతా ఓపెన్గానే జరిగింది’.. కోర్టు ఏం చెప్పిందంటే?

Chandrababu: ‘అంతా ఓపెన్గానే జరిగింది’.. కోర్టు ఏం చెప్పిందంటే?
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో వాయిదాల పర్వం కొనసాగుతుంది. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం (అక్టోబర్ 6) ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. గత రెండు రోజులుగా ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదిస్తూ.. చంద్రబాబుకు స్కిల్ స్కాంకు అసలు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే.. రెండేళ్ల తర్వాత ఈ కేసును బయటకు తీసి బాబును ఇరికించారని అన్నారు.

‘డిజైన్ టెక్ కంపెనీతో వేరే కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. సీఎం సీట్ లో ఉన్న చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటిద్వారా 2 లక్షల మందికి శిక్షణ అందించారు. ఇదంతో ఓపెన్ గానే జరిగింది. ఇందులో స్కాం ఎక్కడుంది? బాబు పాత్ర ఏముంది? పూర్తి రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు. అవినీతి జరిపినట్లు ఆధారాలు ఎందుకు లేవు. కస్టడీ విచారణకు బాబు సహకరించారు. మరోసారి కస్టడీ ఎందుకు. బెయిల్ మంజూరు చేయాల’ని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీఐడీ తరుపున వాదనలు వినిపించిన లాయర్.. ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో ఒప్పందం జరగలేదని అన్నారు. ఆ తప్పిందాల బాధ్యత చంద్రబాబుదేనని కోర్టుకు వివరించారు. బ్యాంకు లావాదేవీలపై విచారించాల్సి ఉండగా.. కస్టడీకి ఇవ్వాలి కోర్టును కోరారు. ఇరువైపు వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.




Updated : 5 Oct 2023 12:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top