Home > ఆంధ్రప్రదేశ్ > లోకేశ్ అరెస్ట్ కోసం కోర్టుకు సీఐడీ.. విచారణ వాయిదా

లోకేశ్ అరెస్ట్ కోసం కోర్టుకు సీఐడీ.. విచారణ వాయిదా

లోకేశ్ అరెస్ట్ కోసం కోర్టుకు సీఐడీ.. విచారణ వాయిదా
X

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అధికార విపక్షాల మధ్య మాటల - తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో నారా లోకేష్ రెడ్ బుక్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై టీడీపీ ప్రభుత్వం వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ చూపిస్తూ లోకేష్ పలు సభల్లో వ్యాఖ్యానించారు. దీనిపై సీఐడీ నజర్ పెట్టింది. లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించింది.

లోకేష్పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. లోకేష్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయని సీఐడీ ఆరోపించింది. 41ఏ నిబంధనలను లొకేష్ బ్రేక్ చేశారని.. ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. అయితే అధికారులు తప్పు చేస్తే భయపడాలని.. తప్పు చేయనప్పుడు భయం ఎందుకని లోకేష్ ప్రశ్నించారు.

Updated : 21 Feb 2024 2:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top