Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : బాబుకు మరో ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్ట్లో చుక్కెదురు

Chandrababu : బాబుకు మరో ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్ట్లో చుక్కెదురు

Chandrababu : బాబుకు మరో ఎదురుదెబ్బ.. ఏసీబీ కోర్ట్లో చుక్కెదురు
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిప్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘంగా మూడు రోజుల పాటు వాదనలు కొనసాగించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ కోర్ట్ చంద్రబాబు పిటిషన్ ను కొట్టేసింది. శుక్రవారం ఇరువైపు లాయర్ల వాదనలు విన్న జడ్జి.. తీర్పును సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది.

అంతేకాకుండా అంగళ్లు, ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లను సైతం ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని సీఐడీ తరుపున లాయర్లు కోర్టుకు తెలిపారు. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. బెయిల్‌ ఇవ్వొద్దని లాయర్లు కోర్టును కోరారు. ఈ వాదనలకు కూడా ఏసీబీ కోర్టు ఏకీభవించింది. క్వాష్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Updated : 9 Oct 2023 10:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top