చంద్రబాబు లాయర్లపై జడ్జి ఆగ్రహం
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇటు చంద్రబాబు, అటు సీబీఐ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరుగుతున్న విచారణలో ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబు లాయర్ల మరో పిటిషన్ వేశారు సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని బాబు తరుపు న్యాయవాదులు జడ్జిని కోరగా.. ఈ విషయంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి డాక్యుమెంట్ల మరోసారి పరిశీలించాలని, దానికి మరికాస్త టైం ఇవ్వాలని పిటిషన్ ద్వారా జడ్జిని కోరారు. దీనిపై ఫైర్ అయిన న్యాయమూర్తి.. లాయర్లు కోర్టు ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదని, అన్నీ ఒకే రకమైన పిటిషన్లు వేస్తున్నారని సీరియస్ అయ్యారు. వరుస పిటిషన్లు వేస్తే విధులు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఆర్డర్స్ సమయానికి కొత్త పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారు. పిటిషన్ వేస్తే మధ్యాహ్నం 12 లోపు వెయ్యాలి, ఒక కేసులో ఆర్డర్స్ ఇచ్చే సమయానికి ఇంకో పిటిషన్ వేస్తే ఎలా. ఇతర పెండింగ్ కేసులు ఎప్పుడు చూడాలంటూ బాబు లాయర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ తో పాటు జైలులో బాబుకు ప్రాణహాని ఉందని, మరింత భద్రత కల్పించాలని న్యాయమూర్తిని చంద్రబాబు లాయర్లు కోరారు. ప్రభుత్వం కల్పించిన భద్రతపై అనుమానాలు ఉండటం ఏంటని లాయర్లను ప్రశ్నించారు జడ్జి.