Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ

చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ

చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు కోసం ఏసీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖను ఏసీబీ కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఉన్న చర్మ సమస్యల కారణంగా ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. చంద్రబాబు పిటిషన్పై అత్యవసర విచారణ జరిపిన ఏసీబీ కోర్టు..రాజమండ్రి జైలులోని స్నేహ బ్లాక్లో చంద్రబాబు ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన హౌజ్ మోషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా డాక్టర్లు, జైళ్ల శాఖ అధికారులతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. చంద్రబాబుకు చర్మ సమస్యలు ఉన్నాయంటూ డాక్టర్లు జడ్జికి చెప్పారు. దీంతో చంద్రబాబు ఉంటున్న బ్యారక్లో ఏసీ ఏర్పాటు చేయాలని, వైద్యుల సూచనలు అమలు చేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.




Updated : 14 Oct 2023 10:10 PM IST
Tags:    
Next Story
Share it
Top