Home > ఆంధ్రప్రదేశ్ > లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుకు ఏసీబీ కోర్టు అనుమతి

లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుకు ఏసీబీ కోర్టు అనుమతి

లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుకు ఏసీబీ కోర్టు అనుమతి
X

కృష్ణా జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గెస్ట్‌ హౌస్‌ జప్తునకు కోర్టు అనుమతి తెలిపింది. జప్తు చేసే ముందు లింగమనేనికి నోటీసులు ఇవ్వాలని తెలిపింది. ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్‌ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించింది. ఇరువైపుల వాదనలు విని గెస్ట్‌ హౌస్‌ జప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేసు నేపథ్యమిదే

చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్‌ప్రోకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. దీనివల లబ్ధిపొందిన లింగమనేని..చంద్రబాబుకు కరకట్టపై గెస్ట్ హౌస్ నిర్మించారని అభియోగాలు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభంలోనే గెస్ట్‌హౌస్‌ అక్రమ నిర్మాణమంటూ ఆరోపణలు చేసింది. ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ‘జగన్‌’ ప్రభుత్వం కూల్చివేసింది. తాజాగా లింగమనేని రమేశ్‌ గెస్ట్‌ హౌస్‌ జప్తుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Updated : 30 Jun 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top