Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. విచారణ అర్హత లేదన్న కోర్టు

Chandrababu : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. విచారణ అర్హత లేదన్న కోర్టు

Chandrababu  : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. విచారణ అర్హత లేదన్న కోర్టు
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో విచారించాలని సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది. కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఆ లోపే క్వాష్ పిటిషన్పై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.


Updated : 5 Dec 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top