అన్నవరం వెళ్తున్నారా?..అయితే వీటికి నో ఎంట్రీ
X
కాకినాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. కొండపైకి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు, గ్లాసుల అమ్మకాలను, వినియోగాన్నికొండపై నిషేధించామని దేవస్థానం ఈవో ఆజాద్ ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేవస్థానం నిర్ణయానికి భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి వినియోగం కోసం స్టీలు, గాజు, రాగి సీసాలనే ఉపయోగించాలని తెలిపారు. వినియోగించాలని సూచించారు.
కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం కొండపై శనివారం నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నామని దేవస్థానం ఈవో ఆజాద్ శుక్రవారం తెలిపారు. కొండపై మంచినీరు తదితరాలకు ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లు, గ్లాసులు విక్రయాలు, వినియోగం నిషేధించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ఈ చర్యలకు భక్తులంతా సహకరించాలని కోరారు. తాగునీటికి కేవలం స్టీలు, గాజు, రాగి సీసాలనే వినియోగించాలని సూచించారు.
అంతేకాదు అన్నవరం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాటేజీలలో అందుబాటులో ఉన్న వసతి, గదులు 50శాతం కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. గదులతో పాటుగా స్వామివారి దర్శనాలు, ప్రసాదం, వ్రతాలు, కల్యాణాలు, ఇతర ప్రత్యేక పూజలు, హోమాలు, కల్యాణ మండపాల బుకింగ్ ను ముందస్తుగా చేసుకునే వెసులుబాటును తీసుకువచ్చారు. ఈ నిర్ణయం ద్వారా దేవస్థానంలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేశామన్నారు ఈవో. సత్యన్నారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రధారణ నిబంధనను పాటించాలని తెలిపారు.
భక్తులు వ్రతాలు, నిత్య కళ్యాణం, పూజలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఈ నిబంధనలను ఫాలో అవ్వాలన్నారు. మరోవైపు ప్రసాదాన్ని అరిటాకుల్లో కాకుండా ప్లేట్లలో అందిస్తున్నారు. స్థానికంగా అరిటాకుల లభ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు అధికారులు.