ఏపీ గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం..
X
ఏపీలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జూన్ 3 వ తేదిన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అర్హత సాధించారు.రేపటి నుంచి ప్రారంభమవుతున్న గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు జూన్ 10తో ముగుస్తాయి.
పటిష్ట భద్రత
గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ వంటి చర్యలకు పాల్పడేందుకు ఎలాంటి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలో పరీక్షలు జరిగే తీరును తమ ఏపీపీఎస్సీ ఆఫీసు నుంచి చూసేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.