పవన్ ద్రోహం చేశారని రేణుదేశాయే స్వయంగా చెప్పారు : అంబటి
X
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. వాలంటీర్లపై పిచ్చి కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకుందామని ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌కు ఎందుకంత తాపత్రాయమన్నారు.
విశాఖపై పవన్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని రాంబాబు స్పష్టం చేశారు. రుషికొండను సందర్శించే పేరుతో హడావుడి చేశారని.. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోందని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాంబాబు హెచ్చరించారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి ఎద్దేవ చేశారు. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి తెలిపారు.