పవన్‌పై మరోసారి విరుచుకుపడిన అంబటి
X
ఏపీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ వార్ మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. జనసేన అధినేతపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు. సినిమా డైలాగులు చెప్పేందుకే పవన్ పనికొస్తాడన్నారు. తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి పవన్‌పై అంబటి విరుచుకుపడ్డారు. చంద్రబాబును సీఎం చేయడానికి కాపులు ఇష్టపడటం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ అయితే కాస్తో కూస్తో ఆలోచిద్దామని కాపులు అనుకున్నారని, అయితే టీడీపీ, జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలముకుందన్నారు. పవన్ సీఎం రేసులో లేకపోవడంతో జనసేనను వదిలి చాలా మంది వైసీపీలోకి వెళ్తున్నారన్నారు. చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరడమే అందుకు నిదర్శనమన్నారు. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా వైసీపీని ఎదురించలేవని స్పష్టం చేశారు. వైసీపీ నిర్వహించిన మూడు సిద్ధం సభలను చూసి టీడీపీ, జనసేన చల్లబడ్డాయన్నారు. 10వ తేదిన జరిగే నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపుపడనుందన్నారు.