Home > ఆంధ్రప్రదేశ్ > పావలా వంతు కూడా పనికిరావు పవన్..అంబటి కామెంట్స్

పావలా వంతు కూడా పనికిరావు పవన్..అంబటి కామెంట్స్

పావలా వంతు కూడా పనికిరావు పవన్..అంబటి కామెంట్స్
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికలో పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా నేడు టీడీపీ, జనసేన తొలి జాబితాను ప్రకటించాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పల్లకి మోయడానికి తప్పా పావలా వంతుకు కూడా పనికిరారని టీడీపీయే తేల్చేసిందని, ఛీ పవన్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా టీడీపీ, జనసేన సీట్ల పంపకంపై మాట్లాడారు. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు, పవన్ చెరొక మాట మాట్లాడుతున్నారన్నారు. అసలు పొత్తులు కుదిరాయా? లేక పొత్తులు కుదిరినట్లు నటిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.

మరోవైపు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ..చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారన్నారు. కాపులకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నేతలు సిద్ధం సభలు నిర్వహిస్తూ ప్రజలకు చేరిన పథకాల గురించి వివరిస్తున్నారు. మొత్తానికి ఈసారి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీని గద్దె దించాలని టీడీపీ, జనసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది.


Updated : 24 Feb 2024 3:42 PM IST
Tags:    
Next Story
Share it
Top