Home > ఆంధ్రప్రదేశ్ > అందుకే వైసీపీని వీడాను.. క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు

అందుకే వైసీపీని వీడాను.. క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు

అందుకే వైసీపీని వీడాను.. క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు
X

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. వైసీపీ వంటి పార్టీలో ఇమడలేక రాజీనామా చేశారని కొందు అంటుంటే.. ఎంపీ టికెట్ కన్ఫార్మ్ కాకపోవడంతోనే రిజైన్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాయుడు తన రాజీనామాపై స్పందించారు. తాను క్రికెట్ తో బిజీగా ఉండడం వల్లే రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘‘నేను జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ t20లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని రాయుడు ట్వీట్ చేశారు. కాగా డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే 10 రోజులు కూడా కాకముందే వైసీపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని రాయుడు పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు.




Updated : 7 Jan 2024 6:30 PM IST
Tags:    
Next Story
Share it
Top