పొలిటికల్ ఎంట్రీపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
X
అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీలో చేరుతారని..గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం సీఎం జగన్‌ను రాయుడు స్వయంగా కలవడం ఊహాగానాలకు బలం ఏర్పడింది. దీనిపై రాయుడు ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు. తాజాగా తన పొలిటిలక్ ఎంట్రీ రాయుడు స్పందించాడు. మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించిన రాయుడు.. అమీనాబాద్ లోని మూలాంకరీశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..గుంటూరు ఎంపీగా పోటీ చేస్తానని వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి కలిసిన సమయంలో రాజకీయాలపై చర్చజరగలేదని వివరించారు. తాను ప్రజా సేవ చేస్తానని, కానీ ఏ ప్లాట్ ఫామ్ నుండి అనేది త్వరలో చెబుతానని వెల్లడించారు. ముందుగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు.