Home > ఆంధ్రప్రదేశ్ > TTD, : హిందూ మతంలో చేరే వారికి ఆహ్వానం..వారికి శుభవార్త

TTD, : హిందూ మతంలో చేరే వారికి ఆహ్వానం..వారికి శుభవార్త

TTD,  : హిందూ మతంలో చేరే వారికి ఆహ్వానం..వారికి శుభవార్త
X

తిరుమల ఆస్థాన మండపంలో గత మూడు రోజుల పాటు ధార్మిక సదస్సు జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు నేటితో ముగిసింది. ఈ సందర్భంగా సదస్సుపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. హిందూ మతంలో చేరేందుకు అన్య మతస్తులు ఆసక్తి చూపితే వారి కోసం తిరుమలలో ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇప్పటి వరకూ ఇలాంటి వేదిక లేదని, దానిని తిరుమలలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.

హిందూ మతంలో చేరాలనుకుని వచ్చే వారికి తిరుమలలోని వేదిక ద్వారా పవిత్ర జల ప్రోక్షణంతో స్వాగతిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో నిర్వహించిన ధార్మిక సదస్సులో 62 మంది పీఠాధిపతులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారన్నారు. పీఠాధిపతులు సూచనలతో, సలహాలతో సదస్సులో మొత్తంగా 19 నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇకపై సోషల్ మీడియా ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాల ప్రచారం చేపడతామని తెలిపారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు హైంధవ ధర్మం విశిష్టత, ఆవశ్యకతను తెలియజేసే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నామన్నారు. తిరుమల స్థాయిలోనే తిరుపతి నగరంలో కూడా ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలా చేస్తామన్నారు. తిరుపతిని కూడా ఓ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువతలో ధార్మిక భావనలు పెంపొందించడానికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.


Updated : 5 Feb 2024 11:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top