సీపీఎస్ రద్దు..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
X
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 63అంశాలకు ఆమోదముద్ర వేశారు. సీపీఎస్ రద్దు చేసిన ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కమిటీ వేసింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు-2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయనున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు, విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు 28 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ సేకరణకు కేబినెట్ అనుమతించింది. వీటితోపాటు పలు కీలకనిర్ణయాలకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.