Home > ఆంధ్రప్రదేశ్ > నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేసుకున్న ఏపీ

నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేసుకున్న ఏపీ

నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేసుకున్న ఏపీ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఏపీ తన వాటా కింద తాగునీటిని విడుదల చేసుకుంది. అయితే పోలింగ్ రోజే ఈ పనిచేయడంతో ఏదో ఉద్దేశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఏపీ అధికారులు గురువారం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసమే నీటిని వదులుకున్నామని చెప్పారు.

అయితే ఫెన్సింగ్‌ను రాత్రికి రాత్రి 500 మంది పోలీసులను పంపి హడావుడిగా ఏర్పాటు చేసి ఉద్రిక్తత ఎందుకు సృష్టించారన్నదానికి సరైన సమాధానం చెప్పడం లేదు. ‘‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాం!’’ అని ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా వందలాది మంది పోలీసులను పంపి బలప్రదర్శనకు పూనుకోవడం అసాధారణంగా ఉండడంతో దురద్దేశంతోనే ఆ పనిచేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకూడదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పార్టీల నేతలకు సూచించారు.

Updated : 30 Nov 2023 12:24 PM IST
Tags:    
Next Story
Share it
Top