Home > ఆంధ్రప్రదేశ్ > టీచర్లకు జగన్ సర్కార్ షాక్..840 మంది ఉద్యోగాలు తొలగింపు

టీచర్లకు జగన్ సర్కార్ షాక్..840 మంది ఉద్యోగాలు తొలగింపు

టీచర్లకు జగన్ సర్కార్ షాక్..840 మంది ఉద్యోగాలు తొలగింపు
X

ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం, గెస్ట్ టీచర్లకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. కొత్త నియామకాల పేరుతో తాజాగా 840 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో కాంట్రాక్టు పద్ధతిలోనూ తమనే టీచర్లుగా తీసుకోవాలనికోరినా స్పందన లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమ క్వాలిఫికేషన్, టీచింగ్ కెపాసిటీని చూసే తమను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని ఇప్పుడు ఇలా కొత్త నియామకాల పేరుతో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చి తమను ఉన్నఫలంగా తొలగిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో 352 కేజీబీవీలు ఉన్నాయి. గతంలో ఇంటర్ టీచింగ్ కోసం నియమితులైన తెలుగు, ఇంగ్లీష్ టీచర్లను పోస్టుల సర్దుబాటు పేరుతో సర్కార్ వారిని ఇంటికి పంపించింది. ఈ క్రమంలో తాజాగా సర్కార్ కాంట్రాక్టు పద్ధతిలో 1,543 పోస్టుల నియామకాలకు మేలో సమగ్ర శిక్ష అభియాన్‌ నోటిఫికేషన్‌‎ను జారీ చేసింది. వందకు వంద మార్కులు వెయిటేజీ అంటూ నోటిఫికేషన్‎లో చెప్పడంతో పాటు బోధన సర్వీసుకు ఏడాదికి అర మార్కు చొప్పున వెయిటేజీ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే, గత ఎనిమిదేళ్లుగా కేజీబీవీలలో పార్ట్ టైం, గెస్ట్ టీచర్లుగా పని చేస్తున్న మాకు 4 మార్కులకు మించి వెయిటేజీ రావడం లేదని ఆందోళన చెందుతున్నారు.

ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 1543 పోస్టులకు గాను 4,243 మంది జాబితాను సమగ్ర శిక్ష అభియాన్ ఆయా జిల్లాలకు పంపించింది. గురువారం ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఈ రెండు రోజులు డెమో నిర్వహించి ఆ తరువాత ఆదివారం పోస్టింగ్ లెటర్స్ అందించేలా షెడ్యూల్‌ ప్లాన్ చేశారు. అయితే ఈ జాబితాలో కొంతమంది అభ్యర్థులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు చూపడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త పోస్టింగుల పేరుతో పోస్టులను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నారని , అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.




Updated : 23 Jun 2023 2:58 PM IST
Tags:    
Next Story
Share it
Top