Home > ఆంధ్రప్రదేశ్ > గుడ్ న్యూస్.. ఉచితంగానే సర్టిఫికెట్లు జారీ చేయనున్న ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఉచితంగానే సర్టిఫికెట్లు జారీ చేయనున్న ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఉచితంగానే సర్టిఫికెట్లు జారీ చేయనున్న ప్రభుత్వం
X

అర్హత కలిగిన లబ్దిదారులకు ఉచితంగా సర్టిఫికెట్లను జారీ చేయాలని ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయించింది. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులయ్యే ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండా కుల, నివాస.. తదితర గుర్తింపు కార్డులను ఉచితంగా ఇవ్వనుంది. ఈ నెల 23 వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది. వలంటీర్లు ఈ శుక్రవారం నుంచి ఆయా క్లస్టర్లలోని ఇంటింటికీ తిరిగి ప్రజావసరాలకు అనుగుణంగా ఏయే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారన్నది తెలిపి వారిని శిబిరం వద్దకు వచ్చేలా సన్నాహాలు చేయనున్నారు. కులం, ఆదాయం, జననం, మరణం, వివాహ, కుటుంబ సభ్యుడు ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్‌ లావాదేవీలు, ఆధార్‌కు ఫోన్‌ నెంబరు అనుసంధానం, పంటసాగు హక్కు వంటి పత్రాలను జారీ చేయనున్నారు.

అధికారులే ప్రజల వద్దకు వెళ్లేలా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల ఇళ్లల్లో ఏమైనా సమస్యలున్నా.. ప్రభుత్వ పథకాలు అందకపోయినా.. సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం జరుగుతున్నా.. పట్టాదారు పాస్ పుస్తకాలకు చేసుకున్న దరఖాస్తుల్లో సమస్యలున్నా.. ఇలా అన్ని ప్రశ్నలు అధికారులే అడిగి ప్రజల సమస్యలు పరిష్కరించనున్నారు. ఈనెల 23నుంచి ఈ కార్యక్రమం మొదలై.. జులై 23 వరకు కొనసాగుతుంది.

Updated : 21 Jun 2023 8:29 AM IST
Tags:    
Next Story
Share it
Top