ఏపీ.. ఇద్దరు ఐఏఎస్ అధిరులకు జైలు శిక్ష
X
కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. జే.శ్యామల రావు, పోలా భాస్కర్‌లు ‘నీరు – చెట్టు’ కార్యక్రమానికి సంబంధించిన కేసులో తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు నెల రోజులు జైలు శిక్ష అనుభవించి, రూ. 1000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేశారు. శ్యామల రావుకు గతంలో మరో కేసులో జైలుశిక్ష పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయకూడదన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించింనందుకు ఆయనతోపాటు విజయ్ కుమార్, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్లకు రెండు వారాలు జైలుశిక్షతో పాటుగా జరిమానా కోర్టు విధించింది. వారు క్షమాపణ చెప్పడంతో జైలు శిక్షను రద్దు చేసి ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది.