మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు: కొట్టు సత్యనారాయణ
X
బీజేపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని.. టీడీపీ కోవర్టులు ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, నడ్డా చదివారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. చాలా సందర్భాల్లో సీఎం జగన్ ను ప్రధాని మోదీ మెచ్చుకున్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ సానుభూతి పరులను పక్కన పెట్టుకుని.. ఇద్దరు బీజేపీ నేతలు మాట్లాడినట్లు ఆరోపించారు. బీజేపీ నాయకుల మాటలు విన్న తర్వాత అమిత్ షా, మోదీ మధ్య విభేదాలు వచ్చినట్లు తనకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు సత్యనారాయణ.
ఇప్పటివరకు ప్రధాని నోటి వెంట జగన్ పై ఒక్క వ్యతిరేక మాట రాలేదు. చంద్రబాబు గతంలో ఢిల్లీ వెల్లినప్పుడు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. జగన్ పై ఉన్న ప్రత్యేక అభిమానంతో పోలవరం నిధులు ఇచ్చారు. బీజీపీ, టీడీపీ కలుస్తే.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంటుందని సత్యనారాయణ విమర్శించారు.