Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో ప్రారంభమైన డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల రిజిస్ట్రేషన్

ఏపీలో ప్రారంభమైన డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల రిజిస్ట్రేషన్

ఏపీలో ప్రారంభమైన డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల రిజిస్ట్రేషన్
X

ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి ఆన్‌లైన్‌ అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభమైంది. ఇంటర్‌ పాసైన విద్యార్థులుడిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ్టి నుంచి (జూన్‌ 19) నుంచి జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పక్రియ ప్రారంభంకానుండగా.. జూన్‌ 21 నుంచి 23వరకు స్పెషల్‌ కేటగిరీ కోటా విద్యార్థుల వెరిఫికేషన్‌ జరగనుంది. ఈ నెల 26 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ కొనసాగనుంది. జులై 3న సీట్ల కేటాయింపు జరగనుండగా.. జులై 4న విద్యార్థులు వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.

దరఖాస్తు విధానం

డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్ల కోసం విద్యార్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspxపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వారి జిల్లాను ఎంపిక చేసుకోవాలి.

అప్లికేషన్‌ పూర్తి చేసిన అనంతరం పేమెంట్‌ చేయాలి. ఇంటర్‌ ఎక్కడ చదివారు? ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలు సమర్పించాల్సి ఉంటుంి. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్‌ చేసి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఫీజు పేమెంట్‌ స్టేటస్ తెలుసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, బర్త్ డే ఎంటర్‌ చేసి అప్లికేషన్‌ ఫాం డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ప్రింట్‌ తీసుకోవచ్చు.





Updated : 19 Jun 2023 11:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top