ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్లో 7 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు
X
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. డిస్కౌంట్లతో విద్యుత్ వాహనాలను అందించేందుకు వాహన తయారీ సంస్థ అవేరాతో నెడ్‌క్యాప్ ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘గ్రీన్ ఆంధ్రా’ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తునారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఒప్పందంలో భాగంగా ఉద్యోగులకు స్పెషల్ డిస్కౌంట్లను అందించనున్నారు. తాజా ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2, టూ వీలర్‌పైన రూ.10వేలు, రెటోరోసా లైట్ స్కూటర్‌పై రూ.5వేల వరకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 స్కూటర్లను అందించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన ఉద్యోగులు శాలరీ నుంచి ఈఎంఐ పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది సర్కార్. నేలకు కనీసం రూ.2500 వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధిక ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే పనిలో నెడ్‌క్యాప్ నిమగ్నమైంది. రానున్న రోజుల్లో హైవేలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లతో పాటు ప్రైవేట్ ప్లేసుల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందకు సిద్ధమవుతున్నారు. తక్కువ సమయంలోనే ఛార్జ్ అయ్యే స్టేషన్లని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని ప్రోత్సాహించడం ద్వారా రాష్ట్రంలో వాతావరణ కాలుష్యం తగ్గించొచ్చని ఆలోచన చేస్తోంది.