Home > ఆంధ్రప్రదేశ్ > లండన్‌లో రోడ్డు ప్రమాదం..తెలుగు యువకుడి మృతి

లండన్‌లో రోడ్డు ప్రమాదం..తెలుగు యువకుడి మృతి

లండన్‌లో రోడ్డు ప్రమాదం..తెలుగు యువకుడి మృతి
X

ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో లండన్ వెళ్లిన తెలుగు కుర్రాడు, ఆ కలలు తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఆ యువకుడిని కబళించింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దొంగ తన కారుతో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఏపీకి చెందిన కిరణ్ కుమార్ నెలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండల గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు కిరణ్ కుమార్. ఈ యువకుడి వయసు 25 ఏళ్లు. ఏలూరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన కిరణ్ ఆ తరువాత ఎంఎస్ చదివేందుకు రెండున్నరేళ్ల క్రితమే లండన్ వెళ్లాడు. ఎంఎస్‌ కంప్లీట్ చేసిన కిరణ్ నిపుణుల సూచన మేరకు మంచి ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడే ఉంటూ కొన్ని కోర్సుల్లో ప్రావీణ్యం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నాడు.

ఇదే క్రమంలో జూన్‌ 26న తన బైక్ పై క్లాసులకు వెళ్తున్న కిరణ్‎ను ఓ దొంగ కారులో వేగంగా వెళ్తూ కిరణ్‌ బైకును ఢీ కొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో కిరణ్ తీవ్ర గాయపడటంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడే గత నెల రోజులుగా వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే కిరణ్ బుధవారం చనిపోయాడు. నెలపాటు కుటుంబసభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ బిడ్డను రక్షించుకోలేకపోయారు. కుమారుడి మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్‌ మృతదేహాన్ని లండన్‌ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు అధికారులు .

Updated : 27 July 2023 9:38 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top