Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. ఆరుగురు భక్తులకు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. ఆరుగురు భక్తులకు గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. ఆరుగురు భక్తులకు గాయాలు
X

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్ద కారు రెయిలింగ్‌ను వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులతో సహా ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తిరుమల ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టి మరో కారును ఢీకొట్టింది.

తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో అలర్ట్ అయిన టీటీడీ.. శ్రీవారి ఆశీస్సులు కోసం విశిష్ట మహా శాంతి హోమం నిర్వహించింది. తిరుమల దిగువ ఘాట్‌ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రమాదాల్లో భక్తులు పెద్దగా గాయాలు లేకుండా బయటపడ్డారని.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు అంటున్నారు.

ఘాట్ రోడ్డు ప్రమాదాలను అధిగమించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించింది. ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో పాటు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.



Updated : 25 July 2023 4:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top