Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం
X

తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదం సంభవించడం భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 7-10 ప్రమాదాలు జరిగాయి. దీంతో ఇటీవల టీటీడీ శాంతి హోమం కూడా నిర్వహించింది. రోడ్డుప్రమాద నివారణ చర్యలను చేప్టటింది. ఫిట్‌నెస్ లేని వాహనాలను అనుమతించకపోవడం, వేగాన్ని నియంత్రించడం వంటి చర్యలను తీసుకుంది. అయితే తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని తిరుపతి అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated : 21 Jun 2023 5:51 PM IST
Tags:    
Next Story
Share it
Top