Home > ఆంధ్రప్రదేశ్ > ప్రిన్సిపాల్ రూపంలో ఉన్న పిశాచి.. భయపెట్టి మరీ అమ్మాయిలపై బలాత్కారం

ప్రిన్సిపాల్ రూపంలో ఉన్న పిశాచి.. భయపెట్టి మరీ అమ్మాయిలపై బలాత్కారం

ప్రిన్సిపాల్ రూపంలో ఉన్న పిశాచి.. భయపెట్టి మరీ అమ్మాయిలపై బలాత్కారం
X

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాల్సిన ప్రిన్సిపల్ విచక్షణను కోల్పోయి తన స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించన ఘటన విజయవాడలో జరిగింది. క్లాసులు చెప్పడం మానేసి వంకర బుద్ధి చూపించిన విద్యార్థినులను లైంగికంగా వేధించన సంఘటనలో ఇప్పటికే పోలీసులు నవోదయ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు. గత ఆరేళ్లుగా సాగుతున్న ప్రిన్సిపల్ దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.




తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్ర రెడ్డిపై పోలీస్ స్టేషన్‎లో మరో కేసు నమోదు అయ్యింది. తనను భయపెట్టి మరీ చాలా సార్లు ప్రిన్సిపల్ బలత్కారం చేశాడని ఓ పూర్వ విద్యార్థిని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసి ఆ తరువాత అబార్షన్ కూడా చేయించాడని ఫిర్యాదులో విద్యార్థిని పేర్కొంది.

తాను నర్సింగ్ చదువుతున్నప్పుడే మా తల్లిదండ్రులు ఫోన్ చేశారని ప్రిన్సిపాల్ రూమ్ కు పిలిపించి తనపై అత్యాచారం చేసినట్లు యువత తెలిపింది.

పోలీసుల ఫిర్యాదులో బాధిత యువతి తెలియజేసిన విషయాలు వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే..." 2017- 2018 వరకు నవోదయ పారా మెడికల్‌లో జీఎన్ఎం నర్సింగ్ కోర్స్ చేశాను. ప్రిన్సిపాల్ నన్ను చాలా సార్లు లైంగికంగా వేధించాడు. ఎవరికైనా చెప్తే కోర్సు పూర్తి కాకుండానే చదువు మధ్యలోనే ఆగిపోతుందని బెదిరించాడు. సర్టిఫికెట్స్ కూడా ఇవ్వనని భయపెట్టాడు. మా పేరెంట్స్ ఫోన్ చేశారని రూమ్‎కి పిలిచేవాడు. నాపైన చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నా ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదు. ఇంట్లోనే ఉంటున్నాను. మీడియా కథనాలు చూసి నాలాగా చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. చదువు పేరుతో లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి. "అని బాధిత యువతి ప్రిన్సిపాల్‎పై కంప్లైంట్ ఇచ్చింది.

ఇటీవల అరెస్ట్ అయిన ప్రిన్సిపాల్ ప్రస్తుతం బెయిల్‏పైన బయటకు వచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు రవీంద్ర చేతిలో వేధింపులకు గురైన విద్యార్థినులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రవీందరపై ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చిన బాధిత యువత వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated : 8 Jun 2023 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top