Home > ఆంధ్రప్రదేశ్ > మాజీ మంత్రి నారాయణపై మరదలు ప్రియా ఫిర్యాదు.

మాజీ మంత్రి నారాయణపై మరదలు ప్రియా ఫిర్యాదు.

మాజీ మంత్రి నారాయణపై మరదలు ప్రియా ఫిర్యాదు.
X

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై తనను లైంగిక వేధిస్తున్నారంటూ ఆయన మరదలు ప్రియ నెల్లురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు ఎలాంటి హెల్త్ సమస్యలు లేకపోయినా పిచ్చిదానిలా క్రియేట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎస్పీ దగ్గరికి వెళ్లడానికి ముందు ఆమెను భర్త మణి, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకుని ఆ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చింది. తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరింది. ప్రియా గతంలో రాయదుర్గం పోలీసు స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియ ఎపిసోడ్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తనపై కన్నేసిన నారాయణ చిత్రవధ చేశారని ఆరోపిస్తూ తమ్ముడు సుబ్రమణ్యం భార్య ప్రియ పెట్టిన పోస్టులు మెయిన్‌ మీడియాలో వచ్చాయి.

సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ అనుకుల మీడియాలో, అభిమానులు దీన్ని షేర్లు చేస్తూ నారాయణపై విమర్శలు చేశారు. ఆమె హెల్త్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా బయటపెట్టారు. ప్రియ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో ఆమె భర్త సుబ్రమణ్యం గతంలో స్పందించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. వీడియో ప్రకటన విడుదల చేసిన ఆయన.. తన భార్య మాటలు పట్టించుకోవద్దని మీడియాను కోరారు. తమకు వ్యాపారపరంగా, రాజకీయ పరంగా ఉన్న ప్రత్యర్థులు ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారని అలాంటివి నమ్మొద్దని కూడా వేడుకున్నారు. భార్య అయిన ప్రియ మాటలు నమ్మొద్దని భర్త సుబ్రమణ్యం వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె పోలీసు స్టేషన్ గడప తొక్కారు. తనకు వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కూడా భర్తతోపాటు బావ నారాయణపై ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

Updated : 12 Feb 2024 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top