Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత
X

తిరుమలలో ఎట్టకేలకు మరో చిరుత బోనులో చిక్కింది. దానిని బంధించడానికి వారం రోజుల నుంచి ఫారెస్టు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నా.. అది తృటిలో తప్పించుకొని తిరుగుతోంది. చివరికి ఆదివారం రాత్రి అది బోనులో చిక్కిందని అధికారులు పేర్కొన్నారు. . దీంతో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బంధించినట్లయింది. తొలుత ఒక చిరుతను ట్రాప్‌ చేయగా.. ఆ తర్వాత రెండు, ఇప్పుడు మరొకటి బోనులో చిక్కాయి.

చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. మోకాలి మిట్ట, లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, 7 వ మైలు రాయి వద్ద బోనులను ఏర్పాటు చేసారు. లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్దే బోనులో చిరుత చిక్కింది. 60 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. కొద్దిరోజులుగా బోన్‌ దగ్గర వరకూ వచ్చి వెనక్కి వెళ్తోంది చిరుత. ఈనెల 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుత ఇదే అని గుర్తించారు అధికారులు.

లక్షితపై చిరుత దాడితో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు ట్రాప్ కెమెరాలతో చిరుతల సంచరాన్ని నిశితంగా గమనిస్తున్నారు. అవి ఏయే ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి..? అన్నదానిపై ఆరాతీస్తూ.. ఆపరేషన్ కొనసాగించారు. ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌తో శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో చిరుత చిక్కిన బోను ప్రాంతానికి టీటీడీ చైర్మన్‌, ఈవోతో పాటు పలువురు అధికారులు వెళ్లారు. అదే ప్రాంతానికి చిరుతలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడితో ఆపరేషన్‌ చిరుత పూర్తయినట్టేనా.. మరికొద్ది రోజులు ఈ ఆపరేషన్‌ కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత రానుంది.

Updated : 28 Aug 2023 10:31 AM IST
Tags:    
Next Story
Share it
Top