Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్

విశాఖలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్

విశాఖలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్
X

ప్రశాంతంగా ఉండే సాగర తీరం నేడు నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం మర్చిపోక ముందే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‎కు గురవ్వడం కలకలం రేపుతోంది. విజయవాడకు చెందిన శ్రీనివాస్, అతడి భార్యను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే భార్యను మధ్యలో వదిలివేయండంతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు.

విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ ఇటీవల విశాఖకు మకారం మార్చారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్‎గా చేరారు. అయితే ఆర్థిక విభేదాలు కారణంగా శ్రీనివాస్ కుటుంబాన్ని దుండుగలు అపహరించి విజయవాడ తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలోనే రియల్టర్ భార్య లక్ష్మిను దించేశారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి తెలిపిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు.. కిడ్నాపర్లను అన్నవరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విశాఖ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడు విజయవాడలో కొంతమంది నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేశి వారిని మోసం చేశాడు. ఈ కేసులో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదైలన అనంతరం విశాఖకు వచ్చేశాడు.ఈ క్రమంలోనే అతడు వసూలు చేసిన రూ.3 కోట్లలో రూ.60 లక్షలు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.


Updated : 29 Jun 2023 6:07 PM IST
Tags:    
Next Story
Share it
Top