ఏఆర్ సీఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసు..రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
X
విశాఖ ఏఆర్ సీఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. విశ్రాంత నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదుని కేవలం రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. అసలు రూ.90 లక్షలు ప్రస్తావన ఎక్కడా రాలేదు. తెచ్చిన 12 లక్షల్లో ఆర్‌ఐ స్వర్ణలత, సూరిబాబులకురూ.ఐదేసి లక్షలు, హోంగార్డు శ్రీనివాసరావుకు రూ.రెండు లక్షలు పంచుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చి కోర్టుకు సమర్పించారు.
ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చిన అంశాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు తీవ్రతను తగ్గించే విధంగా పోలీసులు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రూ.90 లక్షలకు బదులు రూ.12 లక్షలు రాసినట్టు చెబుతున్నారు.
రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.