Home > ఆంధ్రప్రదేశ్ > ఇవాళ ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్

ఇవాళ ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్

ఇవాళ ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్
X

ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత సంబంధిత స్కూల్స్ జాబితా కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే మార్క్ లిస్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీలో టెన్ట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2వ నుంచి 10 వరకు జరిగాయి. పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా.. 1.87 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. పరీక్షలు ముగిసిన 13 రోజుల్లోనే ఫలితాలను విడుదల అవుతున్నాయి. ఇక ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాస్ అయితే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఏపీ టెన్త్ రెగ్యులర్ ఫలితాలను మే నెలలో విడుదల చేయగా 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 75.38 శాతం మంది పాస్ అవ్వగా.. బాలురు 69.27 శాతం మంది పాస్ అయ్యారు.

Updated : 23 Jun 2023 9:34 AM IST
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top