టీడీపీతో పవన్ పొత్తు.. ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదే..
X
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇవాళ జైలులో చంద్రబాబును పవన్ కలిశారు. ఈ సందర్భంగా పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలసి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ స్పందించింది.
జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేస్తే బాగుంటుందని పవన్ ఎప్పటినుంచో అంటున్నారని ఏపీ బీజేపీ నేతలు అన్నారు. అయితే పొత్తులపై తమ చేతుల్లో ఏంలేదని.. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతమైతే బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతుందని తెలిపారు. అయితే పవన్ పొత్తులపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. జనసేన, టీడీపీతో బీజేపీ కలిసివెళ్తుందా లేక కొత్త పొత్తుకు తెరలేపుతుందా అన్నది వేచి చూడాలి.