Home > ఆంధ్రప్రదేశ్ > జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి ఆమోదం

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి ఆమోదం

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి ఆమోదం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ ఎజెండాలోని 49 అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఈ భేటీలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి కేబినెట్ ఆమెదం తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారికి ఈ పథకం వర్తించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ఏపీ సర్కార్ ప్రోత్సాహకాలు ఇవ్వబోతోంది. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వారికి రూ.1లక్ష ప్రోత్సాహం, మెయిన్స్ క్వాలిఫై అయితే 1.5 లక్షల ప్రోత్సాహం అందించబోతోంది.




Updated : 20 Sep 2023 8:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top