Home > ఆంధ్రప్రదేశ్ > Ap budget-2024 : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..బడ్జెట్‌కు ఆమోదం

Ap budget-2024 : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..బడ్జెట్‌కు ఆమోదం

Ap budget-2024  : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..బడ్జెట్‌కు ఆమోదం
X

సీఎం జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. 99 శాతం హామీలను శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలు ఇతర రాజకీయ పార్టీలకు ఒక బెంచ్ మార్క్ అయ్యిందని, కోవిడ్ లేకపోతే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగేదని అన్నారు.

ఈ బడ్జెట్‌లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ళల్లోనూ వైద్యం, విద్యా, వ్యవసాయం, మహిళా, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. మంత్రి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టక ముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులతో కేబినెట్ సమావేశానికి చేరుకున్నారు. బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది. దీంతో ఉదయం 11 గంటలకు బుగ్గన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.


Updated : 7 Feb 2024 9:35 AM IST
Tags:    
Next Story
Share it
Top