Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..వాళ్లకు గుడ్‌న్యూస్

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..వాళ్లకు గుడ్‌న్యూస్

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..వాళ్లకు గుడ్‌న్యూస్
X

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. మంత్రివర్గంలో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. 20 ఏళ్లకు ముందు కేటాయించిన భూములపై హక్కులు కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 63,191.84 ఎకరాల అసైన్డ్ భూములపై లబ్ధిదారులు హక్కులు పొందుతారు. అదే విధంగా లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్‌ అసైనీలు చనిపోతే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేయడంతో పాటు పూర్తి హక్కుల కల్పించాలని నిర్ణయించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ ​ఈ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అలాగే.. ఎస్ఐ‌పీబీ సమా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులకు.. జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.


Updated : 12 July 2023 6:35 PM IST
Tags:    
Next Story
Share it
Top