చంద్రబాబుకు మరో చిక్కు.. ఇన్నర్ రింగ్ రోడ్డుపై వారంట్‌కు..
X
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో చిక్కులో పడ్డారు. సిల్క్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో బాబును అరెస్ట్ చేసిన సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో జోరు పెంచింది. ఈ కేసులో చంద్రబాబును విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖల చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో మాజీ సీఎంతోపాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్‌లు కూడా ముద్దాయిలని సీఐడీ తెలిసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా చంద్రబాబును పేరును చేర్చింది. ఈ కేసులో నారాయణకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్‌లో చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం మార్పులు చేశారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఫిర్యాదు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది చేకూర్చారని ఆరోపించారు. దీంతో సీఐడీ అధికారులు 420 సహా పలు సెక్షల కింద కేసు పెట్టారు. ఏడాదికిపైగా పెండింగులో ఉన్న ఈ కేసు ఫైలు సీఐడీ ఇప్పుడు దుమ్ము దులిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బాబును అరెస్ట్ చేయడతో, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ రిమాండ్‌కు తీసుకుని విచారించడానికి ప్రయత్నిస్తోంది. అవినీతి కేసులతో పాటు మరిన్ని పెటీ కేసులను కూడా వెలికి తీసి విపక్ష నేతను జైల్లో ఉంచడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.